చంద్రబాబు నమ్మినవాళ్లే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారా?

Saturday, April 28th, 2018, 09:29:11 AM IST

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ హవా దాదాపు మూగబోయినట్టే అని అందరికి తెలిసిందే. మళ్లీ పుంజుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపి తెలంగాణాలో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో అసలైన ముఖ్య నేతలు అధికార పార్టీలోకి మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది వరకు పార్టీలో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కనీసం ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు రాజకీయాలకు కొంచెం లాభం ఉండవచ్చని ఇతర పార్టీ నేతలు హస్తం నేతలతో కలిసిపోతున్నారు.

రేవంత్ షాక్ ఇవ్వగానే ఇక టీడీపీ పార్టీ తెలంగాణాలో గుర్తింపు పొందడం కష్టమేనని అందరు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం స్పెషల్ కేర్ తీసుకొని పార్టీని డెవలప్ చెయ్యాలని ప్రస్తుతం ఉన్న నేతలతో చర్చించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు టిడిపికి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే తరహాలో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు టిడిపి లో ఉంటామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఉండడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అందుకు కారణం ఏమిటో గాని వారికి సరైన గుర్తింపు టీడీపీ లో దక్కడం లేదని రూమర్స్ వస్తున్నాయి. జగన్ తన పాదయాత్రతో ప్రజలను ఆకర్షిస్తున్నాడు. దీంతో గ్రామాల్లో ఉన్న చాలా మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ కండువాలని కప్పుకుంటున్నారు. రీసెంట్ గా జగన్ కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపినట్లు టాక్. మరి ఇలానే కొనసాగితే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బె పడుతుంది. మరి చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments