టీడీపీలో మరో వర్గపోరు.. తగ్గేలా లేదు!

Thursday, May 3rd, 2018, 11:36:24 PM IST


తెలుగు దేశం పార్టీని చంద్రబాబు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా గెలిపించాలని ముందుకు సాగుతుంటే పార్టీలో కొంత మంది నేతలు అంతర్గత విభేదాలతో పార్టీ అధ్యక్షుడికి తల నొప్పిగా మారారు. ఇప్పటివరకు ఆ పార్టీలో నుంచి ఇతర పార్టీలోకి వెళ్లినవారు గొడవలోతేనే వెళ్లిపోయారు. అలాగే జగన్ కి కూడా ఫాలోయింగ్ ఏర్పడుతుండడంతో వైసిపిలోకి జంప్ అవుతున్నామని టీడీపీ అధిష్టానానికి మరికొందరు షాక్ ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చెలరేగిన వివాదాని చంద్రబాబు మీటింగ్ తో సెట్ చేసి గొడవలు వస్తే సైలెంట్ గా పరిష్కరించుకోవాలని చెప్పినప్పటికీ ఇప్పుడు మరొక నేత ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు తెదేపా నేతల మధ్య విభేదాలు రావడంతో మాటల యుద్దం నెలకొంది . ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎవరు ఊహించని విధంగా పార్టీ ముఖ్యనేత మంత్రి ఆదినారాయణరెడ్డి కోపంతో కామెంట్స చేయడం చర్చనీయంగా మారింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే టికెట్స్‌ విషయంలో చర్చించడానికి ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ఆగ్రహంతో ప్రశ్నించారు. అదే విధంగా మత్రులకు అలాంటి హక్కు లేదని, ఎమ్మెల్సీగా పోటీ చేసేది నేనే. ఎన్టీఆర్ హయాంలో నుంచి మంత్రులకి జిల్లా అధ్యక్షులకు లేదని, లేని విషయాలను ప్రస్తావించి అంతర్గత విభేదాలు వచ్చేలా కొందరు ప్రయత్నిస్తున్నారని రామసుబ్బారెడ్డి తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments