జగన్ పందికొక్కు.. రాళ్లతో కొట్టండి : సీనియర్ నేత కామెంట్స్

Saturday, December 2nd, 2017, 09:27:23 AM IST

ఆంద్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో అధికార తెలుగు దేశం పార్టి ప్రతిపక్ష వైఎస్సార్ పార్టీ మధ్య మాటల తూటాలు ఏ స్థాయిలో పెళతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవ్వరు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా మళ్లీ అప్పుడే కౌంటర్లు పడుతూనే ఉంటాయి. ఇక ఎలక్షన్స్ దగ్గరి పడుతుండడంతో జగన్ పాదయాత్రతో ఈ సారి జనాలని ఎలాగైనా ఆకర్షించుకోవలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ జగన్ తీసుకున్న నిర్ణయానికి అధికార నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు వేసేస్తున్నారు.

జగన్ పాద యాత్ర చేస్తే కళ్లు నొప్పులు వస్తాయి గాని ఓట్లు రావని ఎద్దేవ చేస్తున్నారు. ఎవరి స్టైల్ లో వారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పై పంచ్ లు వేస్తున్నారు. ఇక పోలవరం గురించి ప్రస్తుతం వివాదాలు కూడా చాలానే చెలరేగుతున్నాయి. పాదయాత్రలో కూడా జగన్ ఎక్కువగా టీడీపీ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ పై టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పటికి సీఎం కాలేడని, 2019 లో రాజకీయ సమాధి తప్పదని కామెంట్ చేశారు. అంతే కాకుండా జగన్ ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటున్నాడు. వారికి టికెట్లు ఇచ్చిన జగన్ పెద్ద పందికొక్కు అని సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఇక పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి దొంగలా లేఖలు రాస్తున్నారు అని జగన్ ని రాళ్లతో కొట్టాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments