కెసిఆర్ కు తొడ కొట్టి మరీ సవాల్ విసిరిన టీడీపీ నేత.!

Monday, October 8th, 2018, 02:49:21 PM IST

తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ గత కొద్ది రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో జోరందుకున్నారు.అందులో భాగంగానే గత కొద్ది రోజులు క్రితం నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసినదే.కొన్ని సందర్భాల్లో ఐతే చంద్రబాబు మీద మరింత స్థాయిలో కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.ఇప్పుడు చంద్రబాబు పై చేసినటువంటి వ్యాఖ్యలపై అక్కడి టీడీపీ నేత దయాకర్ రెడ్డి కెసిఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట లోని జరిగినటువంటి ఒక మీటింగులో దయాకర్ రెడ్డి కెసిఆర్ మీద మాటాడుతూ కెసిఆర్ చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు అని తెలిపారు.కెసిఆర్ తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు పని అయ్యిపోయినట్టే అన్న మాటలకు గాను నేను తొడ కొట్టి మరీ కెసిఆర్ కు సవాల్ చేస్తున్నా దమ్ముంటే మూడో కన్ను తెరువు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కెసిఆర్ కు నిజంగా దమ్ముంటే,మగాడివి ఐతే చంద్రబాబుని అరెస్ట్ చేయించు చూద్దాం అని మండిపడ్డారు.