పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత మృతి..!

Saturday, November 10th, 2018, 12:42:08 PM IST


ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాధంలో టీడీపీ సీన‌యర్ నేత క‌న్నుమూశారు. ఆ జిల్లాలో లింగ‌పాలెంలోని భోగోలు గ్రామ మాజీ స్ప‌ర్చంచ్ తాడేప‌ల్లి కాంతారావు (54) మృతి చెందారు. కాంతారావు త‌న ద్విచ‌క్ర‌వాహ‌నం పై భోగోలు నుండి లింగ‌పాలెం వెళుతుండ‌గా.. ఎదురుగా వ‌స్తున్న కారు ఢీకొట్ట‌డంతో అక్క‌డిక‌క్కడే మృతి చెందారు.

కాంతారావుతో పాటే బండి మీద వ‌చ్చిన మ‌రో వ్య‌క్తికి గాయాలు అవ్వ‌గా.. అక్క‌డి స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక‌ కాంతారావు విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు, బంధువులు టీడీపీ నేత‌లు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాంతారావు మృతితో భోగోలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక కాంతారావు గ‌త పాతిక సంవ‌త్స‌రాలుగా టీడీపీకి సేవ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments