రెండో భార్య‌ను చంపేసిన తేదేపా నేత?

Sunday, January 29th, 2017, 09:31:53 AM IST

untitled-1
ఇటీవ‌ల వైజాగ్‌లో ఓ యాక్సిడెంట్ జ‌రిగింది. ఆ యాక్సిడెంట్‌లో అక్కాజెళ్లెల్లు ఇద్ద‌రూ స్కూటీమీంచి కింద ప‌డ్డారు. అందులో అక్క చ‌నిపోయింది. చెల్లెలు బ‌తికి బ‌య‌ట‌ప‌డింది. అయితే అది జ‌స్ట్ ఊహించ‌ని యాక్సిడెంట్ మాత్ర‌మేన‌ని అంతా భావించారు. కానీ ఆ యాక్సిడెంట్ చేసిన కార్ ప‌క్క‌నే ఉన్న కాలువ‌లోకి దూసుకెళ్లింది. ఆ కార్‌ని అక్క‌డే వ‌దిలేసి దుండ‌గులు పారిపోయారు. క‌నీసం పోలీస్ కంప్ల‌యింట్ కూడా ఇవ్వ‌లేదెవ‌రూ.. పోలీసులే కేసు న‌మోదు చేసుకున్నారు. కానీ అస‌లు మ‌త‌ల‌బు ఇక్క‌డే .. పోలీసులు నిందితులకు అండ‌గా నిలిచి కేసును నీరుగార్చేందుకు య‌త్నిస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది మృతురాలు గౌత‌మి సోద‌రి.

ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ మృతురాలి సోద‌రి ఒక్కో గుట్టు విప్పుతుంటే క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాలు తెలిసొస్తున్నాయి. అది యాక్సిడెంట్ కాదు. కావాల‌ని చేసిన యాక్సిడెంట్. దుండ‌గుల్లో ఒక‌రు న‌ర‌సాపురానికి చెందిన వారు. వైజాగ్‌లో కొంద‌రితో క‌లిసి కుట్ర‌ప‌న్నారు. వాస్త‌వానికి ఈ యాక్సిడెంట్‌లో మ‌ర‌ణించిన గౌత‌మి బ్రిలియంట్ స్టూడెంట్‌. న‌ర‌సాపురంలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటోంది. అక్క‌డే ఓ ప్రేమ‌క‌థ కూడా ర‌న్ అయ్యింది. ఆ ప్రేమ‌క‌థ‌లో ఓ స‌ర్పంచ్‌, తేదేపానేత బుజ్జి ప్రేమికుడు. అయితే అప్ప‌టికే అత‌డు మ్యారీడ్‌. అక్క‌డే చిక్కొచ్చింది. భార్య‌తో క‌లిసి ప‌న్నాగం ప‌న్ని మ‌రీ గౌత‌మిని హ‌త్య చేయించాడ‌ని మృతురాలి సోద‌రి పోలీసుల‌కు వాంగ్మూలం ఇచ్చింది. ప్ర‌స్తుతం పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తొలుత పోలీసులు నిందితుల‌ను కాపాడేందుకు నానా తంటాలు ప‌డ్డారన్న‌ది మృతురాలి బంధువుల ఆరోప‌ణ‌. అది కేవ‌లం యాక్సిడెంట్ అంటూ దొంగ సంత‌కాలు పోలీసులే చేశార‌ని గౌత‌మి సోద‌రి ఆరోపిస్తోంది. స‌ర్పంచ్ బుజ్జి చంపించేశాడు. కార్‌తో గుద్ది చంపేశారు.. అంటూ ఆమె చెబుతోంది. బుజ్జి అత‌డి భార్య ఇద్ద‌రూ చంపించారు అని వాంగ్మూలం ఇచ్చింది. గౌత‌మిని ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కార‌మే చంపేశారు! అన్న కోణంలో ద‌ర్యాప్తు సాగించాల‌ని పోలీసుల‌పై ఒత్తిడి పెరిగిందిప్పుడు. దీనికి మ‌హిళా సంఘాలు, స్థానిక రాజ‌కీయ‌నేత‌ల నుంచి స్పంద‌న వ‌చ్చింది. మ‌రి ఈ కేసు ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.