టీడీపీ నేతల మీద దాడులు జరిగితే జగన్,పవన్ లు సమాధానం చెప్పాలా?

Friday, October 12th, 2018, 10:00:06 PM IST

కొన్ని రోజులు నుంచి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన జరుగుతున్న ఐటీ దాడులు పెను దుమారం లేపాయనే చెప్పాలి.మళ్ళీ తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీద ఈ రోజు జరిపినటువంటి ఐటీ దాడుల జరగడంతో టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ఎప్పుడు లేనిది ఇంత అకస్మాత్తుగా ఒకేసారి కేవలం టీడీపీ నాయకుల మీద దాడులు నిర్వహించడం కక్ష సాధింపుగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీయే చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే టీడీపీ నేత లంక దినకర్ మాత్రం జరుగుతున్న ఐటీ దాడుల నిమిత్తం వైసీపీ అధినేత జగన్ మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ మరియు విజయ్ సాయి రెడ్డిలను ఉద్దేశించి అవినీతి కేసుల్లో ఏ1 మరియు ఏ2 లుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ కేంద్రంలో మోడీ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.వైసీపీ మరియు బీజేపీ పార్టీలు కేంద్రంలో కుమ్మక్కయ్యిపోయి వైసీపీ నేతలు చెప్పిన విధంగానే ఇక్కడ టీడీపీ నాయకుల మీద దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.అదే సందర్భంలో పవన్ పై మాట్లాడుతూ ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు మొదట్లో మాత్రమే విభజన హామీలు,ఇతర అంశాలు పట్ల కేంద్రాన్ని ప్రశ్నించి ఇప్పుడు ఎందుకని ప్రశ్నించడం లేదు అని అన్నారు.వైసీపీ మరియు జనసేన పార్టీలు బీజేపీ పార్టీకి హేతు పార్టీలుగా మారిపోయాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అయినా ఒక భాద్యత గల పదవుల్లో ఉన్నటువంటి వీరు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు వాటిని ఎదుర్కొని నిలబడాలి కానీ ఇలా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని ఆరోపిస్తే ఎలా?రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.