రేవంత్ దెబ్బ‌కు గిజ‌గిజ‌ లాడిన మంత్రి!

Monday, February 27th, 2017, 11:59:10 PM IST


తెలంగాణ రాజ‌కీయాల్లో టి-టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్ శైలి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఆయ‌న‌ మాట‌ల వేడి ఎప్ప‌టికీ రాజుకుంటూనే ఉంటుంది. అధికార తేరాస‌లో గుబులు రేపుతూనే ఉంటుంది. తాజాగా ఆయ‌న ఓ తేరాస మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు 31 జిల్లాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా త‌ల‌పెట్టిన డ‌బుల్ బెడ్ రూం స్కీముల్లో బోలెడంత అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ‌-ప్ర‌యివేటు భాగ‌స్వామ్య ంలో త‌ల‌పెట్టిన ఈ ప్రాజెక్టుల్లో భారీ కుంభ‌కోణం జ‌రిగింది. ఈ కుంభ‌కోణానికి కార‌కుడు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే దీనికి క‌ర‌ణ్ వెంట‌నే కౌంట‌ర్ వేస్తూ .. రేవంత్ చంద్ర‌బాబు తొత్తు. నోటికొచ్చిన‌ట్టు అడ్డంగా మాట్లాడ‌డం కాదు.. అవినీతిని నిరూపించాల్సి ఉంటుంద‌ని స‌వాల్ విసిరారు. ఒక‌వేళ రేవంత్ అలా నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని అన్నారు. ప్రాజెక్టు ఆల‌స్య‌మ‌వుతున్న మాట నిజం. అంత మాత్రాన అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తారా? అంటూ కొట్టి పారేసే ప్ర‌య‌త్నం చేశారు క‌ర‌ణ్‌.