పవన్, జగన్ లపై మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు!

Thursday, October 4th, 2018, 06:17:37 PM IST

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను చూస్తే పవన్ మరియు జగన్ ల పేర్లు చెప్తే తెలుగు తమ్ముళ్ళకి ఎక్కడ లేని మంట పుట్టుకొచ్చేస్తుంది.వీరిద్దరూ చేస్తున్న యాత్రల్లో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను,చంద్రబాబు ఆయన తనయుడు చేస్తున్న అక్రమాలు,అవినీతులను వారి సభల్లో జనంలోకి బలంగానే తీసుకెళ్తున్నారు.దీనితో తెలుగుదేశం పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు,వారి పార్టీకి ఎలాంటి నష్టం కలగకూడదని వారు కూడా తీవ్ర స్థాయిలో ఈ ఇద్దరినీ విమర్శిస్తున్నారు.

వీరిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు లంక దినకర్ మాట్లాడుతూ పవన్ మరియు జగన్ లకు చంద్రబాబు చేసే అభివృద్ధి కనిపించడం లేదని,అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని అది వారు గుర్తించాలని మండిపడ్డారు.వారికి ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదని,ఎందుకని వారు అబద్ధపు మాటలు,ప్రచారాలతో ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు.పవన్ మరియు జగన్ లకు చేతనైతే మేము బీజేపీ పై చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపై ప్రశ్నించాలని తెలిపారు.ఒక్క గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే పట్టించుకోని,మిగతా దేశం అంతటిని గాలికి వదిలేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకని వీరిద్దరూ నిలదీసి అడగలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.