తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఐటీ అధికారులు..!

Friday, October 5th, 2018, 11:15:35 AM IST

తెలంగాణా రాష్ట్రం లోని రేవంత్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారన్న నెపంతో అకస్మాత్తుగా జరిగినటువంటి ఐటీ అధికారుల సోదాలు ఒక్కసారిగా తీవ్ర కలకలాన్ని రేపాయి.దీనితో తెలంగాణా రాజకీయ నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.తెలంగాణకే పరిమితం అవుతాయనుకున్న ఐటీ దాడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయి,ఏపీ లో కూడా దాడులు జరుగుతాయని,అందులోను ముఖ్యంగా తెలుగుదేశం నేతలపైనే ఐటీ అధికారుల కన్ను పడిందన్న వార్తలు బలంగా వచ్చిన ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అనుకున్న విధంగానే టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి.

నిన్న వేరువేరు బృందాలుగా వచ్చినటువంటి ఐటీ అధికారులు విజయవాడ,గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో ఐటీ దాడులు చేసినట్టు తెలుస్తుంది.నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆస్తుల మీద నిన్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు నిన్న మొదలు పెట్టిన ఈ సోదాలు ఈ రోజు వరకు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.ఆయనకి సంబందించిన పరిశ్రమల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.సదరన్ నిర్మాణాలు,వీ ఎస్ లాజిస్టిక్స్ తదితర కంపెనీల్లో విరివిగా సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది.దీనితో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు పట్టుకుంది.ఏ వైపు నుంచి ఎవరు వచ్చి సోదాలు చేస్తారో అని అక్రమార్కులు జాగ్రత్తలు పడుతున్నారు,మరికొంత మంది కేంద్రంలో నరేంద్ర మోడీయే వారిపై కక్ష గట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.