చంద్రబాబు ఇంటి ముందర ధర్నా

Tuesday, February 28th, 2017, 01:21:44 PM IST


తెలుగు దేశం పార్టీ అధినేత , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఆ పార్టీ నేతలు సీరియస్ గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తరఫున పోటీ చేసే వారి లిస్టు లో పార్టీ కోసం కష్టపడేవారి పేర్లు ఎక్కడ అలేవు అంటూ ఇతర పార్టీ ల నుంచి వలస వచ్చినవారికే సీట్ లూ టికెట్ లూ అంటూ వారు కోప్పడుతున్నారు. తూర్పు గోదావరి – శ్రీకాకుళం – నెల్లూరు జిల్లాల అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకత్వం మండిపడుతోంది. తూర్పుగోదావరిలో చిక్కాల రామచంద్రరావు – నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డిపై అక్కడ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిని నామినేషన్ కు సిద్ధం చేయడం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలను పిలపించడం వంటి బాధ్యతలన్నీ జిల్లా ఇన్ ఛార్జి మంత్రులకు అప్పగించారు. ముందుగా అభ్యర్థుల వివరాలను జిల్లాల్లోనే ప్రకటించాల్సిగా ఇన్ ఛార్జి మంత్రులకు సూచించారు. అక్కడ వాతావరణాన్ని బట్టి తాను ఫైనల్ లిస్టు ప్రకటిస్తానని తెలిపారు. శ్రీకాకుళంలో శత్రుచర్ల ప్రకటన రాగానే వ్యతిరేకవర్గం ఎదురుతిరిగింది. పార్టీని నమ్ముకున్న వారికి ఇవ్వకుండా బయట నుండి వచ్చిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పశ్చిమ గోదావరి అభ్యర్థి వ్యవహారం తేలకపోవడంతో బాధ్యత సీఎంపై పెట్టి మంత్రి అయ్యన్నపాత్రుడు వెళ్లిపోయారు. నెల్లూరులో వాకాటి – ఆదాల ప్రభాకరరెడ్డి గ్రూపు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన నెక్కంటి బాలకృష్ణ అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి సీటు బాలకృష్ణకు ఇవ్వాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు నెట్టివేశారు. తాము పార్టీని నమ్ముకుని ఉంటే తమకు ఇవ్వకుండా వేరే వాళ్లకు సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోనూ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అధికారిక ప్రకటనను నిలిపేశారు. అన్ని జిల్లాల్లోనూ ప్రకటనలు ఆపేయాలని ఆదేశించారు.