జగన్ సభా ప్రాంతాన్ని పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన టీడీపీ నేతలు!

Wednesday, June 13th, 2018, 02:25:30 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర తో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా కూడా జనాలను పలకరిస్తూ తన బలాన్ని పెంచుకుంటున్నాడు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ జగన్ ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా ముందుకు వెళుతున్నారు. అయితే జగన్ ప్రజా సంకల్ప యాత్ర పై ఎప్పటికప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులు ఓ కన్నేసి ఉంచుతున్నారనే టాక్ వస్తోంది. జగన్ నిర్వహించిన సభలలో మళ్లీ టీడీపీ నాయకులూ వెళ్లి వినూత్న ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

రీసెంట్ గా ప్రకాశం జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి శ్యామలా థియేటర్ వద్ద వైసిపి అదినేత జగన్ బహిరంగసభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఎక్కువగా జగన్ టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ లోపాలను తెలియజేశారు, అయితే జగన్ మాట్లాడి సభను ముగించుకొని వెళ్లగానే ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. మహిళా నేతలతో కలిసి తెలుగు తమ్ముళ్లు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పసుపు నీళ్లు చల్లి జగన్ సభ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అలాగే ఆ తరువాత ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి రాష్ట్రాన్ని తెలుగు దేశం పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తోందని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments