చంద్రబాబు కి తలనొప్పి తెస్తున్న తెలుగు ‘తమ్ముళ్ళు .. నిలువెల్లా అవినీతి , అబద్ధాలు

Friday, September 30th, 2016, 05:17:24 AM IST

babu-chandra-babu
ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరెన్నో సంవత్సరాలు ప్రతిపక్ష పెద్దగా ఉన్న చంద్రబాబు 2014 లో తను ఎదురు చూసిన ముఖ్యమంత్రి పదవి మళ్ళీ దక్కించుకున్నారు. మొదట్లో అంతా బాగానే నడిచింది కానీ ఇప్పుడు బాబు వ్యవహారం మీద ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2016 ఏడాది పూర్తి అవుతున్న తరుణం లో చంద్రబాబు గారి టైం ఏమీ బాలేదు అని అనిపిస్తోంది. ఒకటి తరవాత ఒకటిగా ఆయనకి వరస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తనకి బలం కావాల్సిన తాన్ తెలుగు తమ్ముళ్ళు ఆయనకే తలనొప్పులు సృష్టిస్తూ , బలహీనత గా మారుతుండడం బాధాకరమైన విషయం. ఒక పరిణామం పూర్తయ్యింది అనుకుంటే మరొకటి ఆయన నెత్తిమీద కుంపటి లాగా విసిగిస్తోంది పాపం. మొన్నామధ్య తెలుగు తమ్ముళ్ళు అయిన సుజనా , గల్లా జయదేవ్ లు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం బట్టబయలు అయ్యింది. ఒక పక్క ప్రత్యేక హోదా వల్ల ఉపయోగాలు లేవు అంటూనే సుజనా చౌదరి తన పారిశ్రామిక వేత్త రూపం లో ప్రత్యేక హోదా కలిగిఉన్న రాష్ట్రాలలో తమ పెట్టుబడులు పెట్టేసి టాక్స్ లు కలిసొచ్చే విధంగా ప్రవర్తించారు. ఓపక్క హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉందని చెబుతూ.. కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ పరమాన్నం అన్నట్లుగా ఫీలవుతున్న నేతలు.. వ్యక్తిగతంగా పెట్టబడులు హోదా ఉన్న రాష్ట్రాల్లో పెట్టటం బాబు సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసింది. ఈ విషయంలో అసలే అసహనంతో ఉన్న బాబుగారికి నెల్లూరు జిల్లా వేంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ మీద కొత్త ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓబులవారిపల్లి – కృష్ణపట్నం మధ్య నిర్మిస్తున్న కొత్త రైల్వేలైన్ నిర్మాణం పనులు సక్రమంగా సాగాలంటే తనకు రూ.5కోట్లు డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ పనులు ఆపేస్తున్నారు అనే వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఓపెన్ గా అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు ఎదురుకుంటూ ఉన్నా కూడా చంద్రబాబు సైలెంట్ గా ఉండడం విమర్సాలకి తావు ఇస్తోంది. తమ ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు గారు తప్పు లేదు అని ఫీల్ అవుతుంటే గనక వెంటనే ఆ విషయం క్లియర్ అయినా చెయ్యాలి కానీ ఆయన ఏదీ చెయ్యకుండా సైలెంట్ గా ఉండడం అందరికీ షాకింగ్ గా ఉంది. కామ్ గా ఉంటున్న బాబు తీరును తప్పు పడుతున్నారు జనాలు. ఈ రెండు అంశాలతో నే బాబుగారి బుర్ర వేడెక్కిపోతుంటే గుంటూరు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే మాడుగుల వేణు గోపాల రెడ్డి ఇనిట్ మీద ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడి చేసారు అనే వార్తలు ఒస్తున్నాయి. ఆయన ఆస్తులు కేవలం గుంటూరు లోనే కాక బెంగళూరు , హైదరాబాద్ లలో కూడా ఉన్నాయి వీటి కార్యాలయాల మీద దాడులు జరిగాయి అంటున్నారు. ఈయన ఆస్తులకి సంబంధించిన కొన్ని కీలక పత్రాలని ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని ప్రచారం సాగుతోంది.