ఆధారాలు లేకుండా పవన్ పై ఈ ఆరోపణలు ఇంకెనాళ్ళు !

Monday, November 19th, 2018, 12:19:20 PM IST

తమని కాదని పవన్ కళ్యాణ్ బయటికొచ్చాక కొన్నాళ్ల పాటు ఏం మాట్లాడాలో, ఎలా పవన్ ను ఢీ కొట్టాలో తెలీక తికమకపడిన తెలుగుదేశం నాయకులు ఆ తర్వాత ఒక స్కీమ్ తయారుచేసుకుని పవన్ ను విమర్శించడం మొదలుపెట్టారు. ఆ స్కీమ్ నిండా అసత్య ఆరోపణలే ఉన్నాయి తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడ సరైన ఆరోపణ లేదు.

మొదట్లో పవన్ అపరిపక్వ వైఖరి వలన మోడీకి కోపం వస్తుందని, దాంతో వచ్చే ప్యాకేజీ కూడ రాదనీ వాపోయిన దేశం నాయకులూ మోడీతో బాబు దోస్తీ చెడిన మరుక్షణమే మోడీని పవనే ఎందుకు విమర్శించడంలేదు, మోడీతో పవన్ ఏదో లోపాయికారీ వ్యవహారం కుదుర్చుకున్నారని అందుకే రాఫెల్ కుంభకోణం, సీబీఐలో అవినీతి వంటి అంశాల్లో మాట్లాడటంలేదని కువిమర్శలు చేయడం మొదలుపెట్టారు.

మధ్య మధ్యలో జగన్ తో కలిసి మోడీ పంచన చేరారని కూడ పవన్ ను తిట్టిన దేశం నేతలు ఇప్పుడు ఏకంగా పవన్ కు వైఎస్ హాజగన్ 40 సీట్లను ఆఫర్ చేశాడని, వారిద్దరూ మోడీకి లోగిపోయారని అంటున్నారు. ఈ ఆధారాలు లేని, టైమ్ పాస్ ఆరోపణలు టీడీపీ శ్రేణుల్లో బాగానే నానుతున్నా సామాన్య జనం మాత్రం ఇలా అసత్యపు ఆరోపణలు చేసి ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు, అవన్నీ నిజమైతే ఆధారాలు చూపండని అంటున్నారు.