జగన్ అభిమానులు మరింత మండేలా..తెలుగు తమ్ముళ్ల ప్రవర్తన.!

Wednesday, November 7th, 2018, 07:09:12 PM IST

జగన్ మీద జరిగిన హత్యా ప్రయత్నం మీద ఇప్పటికే జగన్ అభిమానులు మరియు వైసీపీ శ్రేణులు అంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.దానికి తోడు ఈ దాడి మీద మొన్న సభలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు మరింత కోపాన్ని తెప్పించాయి.ఒక భాద్యత గల పదవిలో ఉంది ప్రతిపక్ష నాయకుడికి ఇలా జరిగితే కనీసం కూడా పరామర్శించలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నా సరే టీడీపీ నేతలు మాత్రం జగన్ పై జరిగినటువంటి దాడిని మాత్రం ఇంకా వెటకారంగానే చూస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కడప జెడ్పీ శ్రీనివాస రెడ్డి వైసీపీ అభిమానుల యొక్క సహనాన్ని మరింత పరీక్షిస్తూ వారికి మరింత కోపం తెప్పించేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.పేరుకి జగన్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా సరే జనం ఎవరు ఆయన్ని పట్టించుకోవట్లేదని,సంచలన వ్యాఖ్యలు చేశారు.అందుకనే జగన్ ఉనికి కోసం చిన్న పిల్లలు పుట్టగానే టీకాలు వేసేటటువంటి చిన్నపాటి కత్తిని తీసుకొని ఆయనే కావాలని పొడిపించుకొని సానుభూతి కోసం టీడీపీయే తన మీద ఆ దాడి చెయ్యించారని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.జగన్ ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు ఆడుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.