జ‌గ‌న్.. జ‌గ‌న్.. జ‌గ‌న్ .. టీడీపీ నేత‌లు సంచ‌ల‌నం..!

Monday, November 19th, 2018, 05:01:04 PM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ శ్రేణులు విరుచుకుప‌డుతున్నారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు టీడీపీ నేత‌లు. మ‌రి ఆ వ్యాఖ్య‌లేంటో మీరూ ఒక‌సారి చూడండి.

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ బోర్డర్‌ లైన్‌ పర్సనాలిటి డిజార్డర్‌ వ్యాధితో బాధపడుతున్నాడ‌ని..ఆయన వెంట‌నే మంచి సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌ను సంప్రదిస్తే మంచిది అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

జగన్‌ ఆడిన కోడి కత్తి డ్రామా ఫెయిల్ అయ్యింద‌ని.. దీంతో ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ని అస‌హ్యించుకుంటున్నార‌ని తాజాగా రాజమహేంద్రవరంలో మాట్లాడుతూఐ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జ‌గ‌న్ పై వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్ర శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌

జ‌గ‌న్‌కు అర‌సెంటీ మీట‌రు గాయ‌మైతే సానుభూతి కోసం.. త‌న పై హత్యాప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని, కోడిక‌త్తి డ్రామాకి తెర‌లేపాడ‌ని, చంద్ర‌బాబు ఏనాడు హ‌త్యా రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌లేద‌ని రాష్ట్ర అనంత‌పురంలో శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్ అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ జ‌న‌సేన‌లు క‌లిసి వ‌చ్చినా, టీడీపీకి 110 సీట్లు వ‌స్తాయ‌ని.. మ‌రోసారి టీడీపీ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని.. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

వైసీపీ కోడికత్తి డ్రామా ఆడుతూ.. సానుభూతి కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ఇక‌నైనా జ‌గ‌న్ నాట‌కాలు ఆపాల‌ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన బుద్దా వెంక‌న్న జ‌గ‌న్ ఈ జ‌న్మ‌లో ముఖ్య‌మంత్రి కాలేడ‌ని వ్యాఖ్య‌లు చేశారు.