మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు.. ఇలాంటి స్ట్రోక్ ఊహించ‌ని చంద్రబాబు..!

Sunday, February 10th, 2019, 06:45:47 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒక‌వైపు ఎన్నిక‌లు ముంచుకొస్తుంటే.. మ‌రోవైపు అధికార తెలుగుదేశం పార్టీ నుండి వ‌రుస‌గా కీల‌క‌నేత‌లు పార్టీని వీడుతుండ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి మ‌రో పార్టీలో చేరిపోయారు. అలాగే మ‌రికొంత మంది సిట్టింగ్ నేత‌లు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సిట్టింగ్‌ల విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా బూత్‌లెవ‌ల్ కార్య‌క‌ర్త‌లు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.

అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. క‌డ‌ప జిల్లాలో చంద్రబాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళ‌కు ఊహించ‌ని స్ట్రోక్ త‌గిలింది. టీడీపీ త‌మ్ముళ్ళ‌కు అని కూడా ఎందుకు అన్నామంటే.. జ‌మ్మ‌ల‌మ‌డుగులో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డికి చెందిన బూత్‌లెవ‌ల్ కార్య‌క‌ర్త‌లు రికార్డు స్థాయిలో 80 కుంటుంబాల‌కు చెందిన కీల‌క నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరంతా వైఎస్సార్ క‌డ‌ప జిల్లా, పెద్దముడియం మండ‌లం, కొండ‌పాంప‌ల్లికి చెందినా వారు కావ‌డం గ‌మ‌నార్హం. వీరంతా కొన్ని ద‌శాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్న కార్య‌క‌ర్త‌లు. అయితే వీరంతా క‌ల‌సి ఒకేసారి, అక్క‌డి మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. దీంతో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డికే కాకుండా చంద్ర‌బాబుకు పెద్ద దెబ్బే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.