బీజేపీతో స్నేహం వద్దు: టీడీపీ నేతలు

Saturday, February 3rd, 2018, 01:30:46 AM IST

ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని సైలెంట్ గా కొనసాగిస్తున్న చంద్రబాబుకు బడ్జెట్ ప్రళయం ఒక్కసారిగా నిరాశపరిచింది. కేంద్రమంత్రి జైట్లీ నోట ఆంధ్రప్రదేశ్ పేరు అలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా నిరాశ చెందారు. అసలే రాష్ట్రానికి ఆదాయం లేదు. కేంద్ర సహాయం కోసం గత కొన్నేళ్లుగా చంద్రబాబు ఎదురుచూశారు. అయినా కూడా లాభం దక్కలేదు. మోడీతో చంద్రబాబు మంచి రిలిషెన్ ని కొనసాగించినప్పటికీ ఏ మాత్రం కరుణ చూపలేదు.

రైల్వేజోన్ ఏర్పాటు కోసం ప్రత్యేక బడ్జెట్ అని చెప్పినా కూడా అందులో ఎలాంటి నమ్మకం లేదని ఏపీ నేతలు నిరాశ చెందుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒక్కసారిగా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం చంద్రబాబుపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ తో స్నేహాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై నేతలు చర్చించాలని చంద్రబాబును అడుగుతున్నారు. రీసెంట్ గా టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఇదే విషయాన్ని మీడియాతో చెప్పారు. కేంద్రం బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం చేసిందని విశాఖ రైల్వే జోన్ పై కూడా అనుమానం కలుగుతోందని బదులిచ్చారు. ఇక బిజెపితో ఉండాల వద్దా అనే విషయాన్ని మరో రెండు రోజుల్లో చంద్రబాబుతో సమావేశమై ఒక నిర్ణయానికి వస్తామని రాయపాటి బదులిచ్చారు.