వేడెక్కించ‌నున్న‌ తేదేపా మ‌హానాడు?

Tuesday, May 1st, 2018, 02:25:26 AM IST

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు ఎప్పుడు? ప‌్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది. ఓ అధికారిక స‌మాచారం ప్ర‌కారం.. మే 24 న హైదరాబాద్‌లో ఈ స‌మావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఎన్టీర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్ రమణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు సన్నాహాలపై చర్చించారు. మే మొదటివారంలో రాష్ట్ర పార్టీ సర్వసభ్యసమావేశం ఏర్పాటు చేయాలని..మే 10 నుండి 20 తేదీవరకు 17 పార్టమెంట్ నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు నిర్వహించి పార్టీ క్యాడర్‌ను సమాయుత్తం చేయాలని పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్రతినిధులు కొత్తకోడి దయాకర్ రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, కార్యక్రమాల కమిటీ కన్వీనర్ బుచ్చిలింగం త‌దిత‌రులు పాల్గొని రాష్ట్రంలో తేదేపా పార్టీ తాజా స‌న్నివేశం, తీరుతెన్నులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చించారు.

  •  
  •  
  •  
  •  

Comments