కాంగ్రెస్‌తో టీడీపీ మైండ్‌ గేమ్ ఆడుతోందా?

Thursday, October 25th, 2018, 10:14:03 AM IST

తెలంగాణ‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఓ ప‌క్క తెరాస దూకుడుగా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతుంటే మ‌హాకూట‌మి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ దాని మిత్ర ప‌క్షాలు ఇంకా సీట్ల పంప‌కం తేల‌క కాల‌యాప‌న చేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా ఇంకా సీట్ల స‌ర్దుబాటు తేల‌క‌పోవ‌డంతో ఎవ‌రికివారే య‌మునాతీరే అన్న‌చందంగా త‌మ అభ్య‌ర్థుల్ని సీక్రెట్‌గా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్ర‌క్రియ‌కు ప‌దునుపెట్టిన టీడీపీ ముందుగా తేరుకుని త‌మ అభ్య‌ర్థుల్ని సీక్రెట్‌గా సిద్ధం చేసేసింది.

సీట్ల విష‌యంలో కుమ్ములాట వ‌ద్దంటూ బ‌య‌టికి మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న టీడీపీ నేత చంద్ర‌బాబు నాయుడు సీక్రెట్‌గానే త‌న క్యాడ‌ర్‌ను సిద్ధం చేసి మ‌హాకూట‌మికి పెద్ద ఝ‌ల‌కే ఇచ్చాడు. పొత్తు ముఖ్యం సీట్లు కాదంటూనే త‌న మార్కు రాజ‌కీయానికి తెర‌తీసి మిత్ర ప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. టీజెఎస్‌, సీపీఐ సీట్ల విష‌యంలో బెట్టు చేస్తుంటే దీన్ని ఆస‌రాగా తీసుకుని టీడీపీ డ‌బుల్ గేమ్ మొద‌లుపెట్టింది. రాజేంద్ర‌న‌గ‌ర్ స్థానాన్ని కాంగ్రెస్ బ‌లంగా కోరుకుంటుండ‌గా ఇదే స్థానం నుంచి త‌మ అభ్య‌ర్థిని రంగంలోకి టీడీపీ దింపుతుండ‌టం కాంగ్రెస్ వర్గాల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది.

టీటీడీపీ సీక్రెట్‌గా సిద్ధం చేసుకున్న స్థానాలు, దాని అభ్య‌ర్థుల జాబితా ఇదేనంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ వివ‌రాలివి. శేరిలింగంప‌ల్లి- భ‌వ్య‌ప్ర‌సాద్‌, కూక‌ట్‌ప‌ల్లి- పెద్దిరెడ్డి, ఉప్ప‌ల్ – వీరేంద్ర‌గౌడ్‌, కుత్బుల్లాపూర్ – అర‌వింద్ కుమార్ గౌడ్ లేదా కూన వెంక‌టేష్‌గౌడ్‌, రాజేంద్ర‌న‌గ‌ర్ – గ‌ణేష్ గుప్తా లేదా సామ భూపాల్‌రెడ్డి, జూబ్లీహిల్స్ – అనూష రామ్ లేదా ప్ర‌దీప్ చౌద‌రి, ఖ‌మ్మం – నామా నాగేశ్వ‌ర‌రావు, స‌త్తుప‌ల్లి – సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, అశ్వారావుపేట – మ‌చ్చా నాగేశ్వ‌ర‌రావు, మ‌క్త‌ల్ – కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి, దేవ‌ర‌క‌ద్ర – సీతా ద‌యాక‌ర్‌రెడ్డి, జ‌డ్చ‌ర్ల – ఎర్ర శేఖ‌ర్‌, వ‌న‌ప‌ర్తి – రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, నిజామాబాద్ రూర‌ల్ – మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, కోరుట్ల – ఎల్‌. ర‌మ‌ణ‌.

  •  
  •  
  •  
  •  

Comments