పవన్ కళ్యాణ్ ని తోలు బొమ్మలా మోడీ,అమిత్ షా ఆడిస్తున్నారంట.?

Wednesday, October 3rd, 2018, 03:33:05 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి.వాటిని పెద్దగా పట్టించుకోని పవన్ వాటి తీవ్రత కాస్త ఎక్కువయ్యేసరికి ఈ మధ్య అయితే కాస్త వారి ఆరోపణల మీద స్పందిస్తూ కాస్త గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ మధ్య పవన్ చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న విమర్శలకు గాను తెలుగుదేశం పార్టీ మంత్రి జవహర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న వ్యాఖ్యలపై పవన్ ని కేంద్రంలో నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు తోలు బొమ్మలా పవన్ ను ఆడిస్తున్నారని,తనకి అధికారం మీద ఆశ లేదంటున్నారు మరి చంద్రబాబుని కూడా అధికారంలోకి రానివ్వనటున్నారు..మరలాంటప్పుడు లక్ష కోట్లు దోచేసిన వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.అధికారం మీద ఆశ లేనప్పుడు మరి ఇలాంటి డ్రామాలెందుకు అని,తన సభలకు వచ్చే యువతను రెచ్చగొట్టినా సరే వారెవరు నీకు ఓటు వెయ్యరు అని మండిపడ్డారు.