చంద్ర‌బాబుకు బిగ్ షాక్ : చేతులెత్తేస్తున్న‌ టీడీపీ మంత్రులు..!

Friday, February 8th, 2019, 11:54:39 AM IST

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో మూడు నెలల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో, అధికార టీడీపీ నుండి వ‌రుస‌గా కీల‌క‌మైన సిట్టింగ్ నేత‌లు జంప్ అవుతుండ‌డంతో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. అస‌లే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌ని డ‌బ్బా కొట్టుకునే టీడీపీ నుండి ఇలా వ‌రుస‌గా పెద్ద త‌ల‌కాయ‌లు అంద‌రూ వ‌ల‌స బాట ప‌ట్టుతుండ‌డంతో వారి ఎలా ఆపాలో తెలియ‌డంలేదు చంద్ర‌బాబుకు.

అయితే ఆ బాధ్య‌తను చంద్ర‌బాబు కొంద‌రు మంత్రుల‌కు అప్ప‌గించ‌గా.. తాజాగా వారు కూడా చేతులెత్తేస్తున్నార‌ని తెలుస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన చంద్ర‌బాబు వెంట‌నే ఆమంచిన బుజ్జ‌గించ‌డానికి కొంద‌రు మంత్రుల‌ను రాయ‌భారం పంపారు. వారి మాట కూడా ఆమంచి విన‌క‌పోవ‌డంతో ఏకంగా చంద్ర‌బాబే ఆమంచితో భేటీ కావ‌ల్సి వ‌చ్చింది. బాబుతో భేటీ అనంత‌రం ఇన్‌డైరెక్ట్‌గా చాలా విష‌యాలు చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి అస్స‌లు బాగ‌లేద‌ని, దీంతో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే త‌న‌కు రాజ‌కీయ‌భ‌విష్య‌త్తు ఉండ‌దని త‌న స‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఆమంచిని ఆప‌డానికి టీడీపీ తీవ్రంగా ప‌య‌త్నం చేశార‌ట‌. అయితే ఆమంచి మాత్రం ఆయ‌న‌కు సారీ చెప్పార‌ట‌. దీంతో ఖంగుతిన్న ఆ మంత్రిగారు, ఇలాంటి బుజ్జ‌గింపులు త‌న‌వ‌ల్ల కాద‌ని, ఇంకా పార్టీ నుండి వెళ్ళే వాళ్ళు కొంద‌రు ఉన్నార‌ని, వారంద‌రినీ బుజ్జ‌గిస్తూ ఆప‌డం త‌న‌వ‌ల్ల కాద‌ని చంద్ర‌బాబు వ‌ద్ద తేల్చి చెప్పార‌ట మంత్రిగారు. దీంతో ఏకంగా మంత్రులే ఇలా చెబుతుండ‌డంతో చంద్ర‌బాబుకు ఏం చేయాలో అర్ధం కావ‌డంలేద‌ట‌. ఏది ఏమైన ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చంద్ర‌బాబుకు వ‌రుస‌గా ఊహించ‌ని షాక్‌లు త‌గులుతున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.