బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై వేటకొడవళ్లతో దాడి..?

Saturday, March 16th, 2019, 11:32:52 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల హీట్ పెరిగిపోయింది. ఒక‌వైపు ఎన్నిక‌ల ప్ర‌చారం, మ‌రోవైపు అభ్య‌ర్ధుల ఎంపిక‌లో అన్ని పార్టీలు నిమ‌ఘ్న‌మైపోయాయి. ఈ క్ర‌మంలో హ‌త్యా రాజ‌కీయాలు కూడా తెర‌పైకి వ‌చ్చి సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇక తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య ఏపీలో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.
వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడ‌క ముందే తాజాగా మ‌రో ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపుతోంది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేయ‌డంతో ఆ జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది. మంత్రాలయం మండలం కగ్గల్లులో తిక్కారెడ్డి ప్రచారం చేస్తుండగా వేటకొడవళ్లతో దాడి చేశారని తెలుస్తోంది. దీంతో అక్క‌డి పోలీసులు గాల్లో కాల్పులు జ‌రిపి అక్కిడి ప‌రిస్థితులు స‌రిదిద్దేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆ కాల్పుల్లో తిక్కారెడ్డితో పాటు ఒక ఎస్సై గాయ‌ప‌డ్డారు. దీంతో అక్క‌డి ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఓట‌మి భ‌యంతోనే వైసీపీ అభ్య‌ర్ధి బాల‌నాగిరెడ్డి త‌న పై దాడి చేయించార‌ని టీడీపీ అభ్య‌ర్ధి తిక్కారెడ్డి ఆరోపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.