చింతమనేని బూతు పురాణం “ఛీ” కొడుతున్న మీడియా..ఒక్క వాళ్ళు తప్ప!

Wednesday, October 31st, 2018, 03:11:35 PM IST

తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనే పేరు ఆ మధ్య పెద్దగా వినిపించపోయినా పవన్ యొక్క పోరాట యాత్ర మూడో విడత మొద్దలయ్యిన తర్వాత అతని పేరు రాష్ట్రం మొత్తం మోగిపోయింది.అయితే పవన్ ఆయన్ని ఏ విషయంలో అంత గట్టిగా విమర్శించారో కూడా అందరికి తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాంటి ఆకు రౌడీలను అదుపులో పెట్టుకోవాలి లేకపోతే ప్రజా క్షేత్రం తిరగబడితే ఎలా ఉంటుందో మీరు చూస్తారు అని చెప్పినా సరే వారి చెవులకు అవి ఏ మాత్రం పట్టలేదు.చింతమనేని ఏమన్నా మారారా? అంటే అది కూడా లేదు.

చింతమనేని ప్రజలను దూషిస్తారని అప్పుడు పవన్ విమర్శిచారు.తాను ఏమి ఎప్పుడు అలా ప్రవర్తించలేదని చింతమనేని పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇప్పుడు తాజగా చింతమనేని యొక్క చర్యలు చూసి మీడియా వారే “ఛీ” అంటున్నారు.చింతమనేని ఏదో మీటింగు ముగించుకొని వస్తుండగా ఆయన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చినటువంటి కొంతమంది మీడియా మిత్రులను ఆయన బెదిరిస్తూ నిప్పులు చెరిగారు,అంతే కాకుండా వారిని పచ్చి బూతులు కూడా తిట్టారు.ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజలకు సమగ్ర సమాచారాన్ని చేరవేసే వారధిగా ఉండేటువంటి మీడియా వారి పై చింతమనేని ఇలా ప్రవర్తించడంతో మీడియా వారు ఆయన్ని ఛీ కొడుతున్నారు,ఈ వీడియోని కొన్ని చానెల్స్ లో ప్రసారం చేస్తుండగా చంద్రబాబు కాలి దగ్గర పని చేసే కొన్ని పచ్చ ఛానళ్ళు మాత్రం ఈ వార్తను వారి ఛానెల్లో మాత్రం ప్రసారం చెయ్యడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments