టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం..సంచలన ఫోన్ కాల్ లీక్..!

Tuesday, February 12th, 2019, 04:50:08 PM IST

ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన కార్యకర్తనే భయభ్రాంతులకు గురి చేస్తూ మాట్లాడుతున్న ఒక సంచలన ఆడియో టేప్ లీకయ్యి సంచలనంగా మారింది.ఆముదాలవలస నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ అక్కడి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్త ఒకతను వేరే పార్టీకి మారి తన ఫ్లెక్సీలు తియ్యించాడని ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడ్డారు.నువ్వు నాలో ఒక వైపే చూసావని రెండో వైపు చూస్తే తట్టుకోలేవంటు సినిమా డైలాగులు పేల్చి సంచలనానికి తెర లేపారు.

అటు వైపు వ్యక్తి మీ కార్యకర్తలే నన్ను పట్టించుకోలేదు అందుకే వేరే పార్టీకి వెళ్లాల్సొచ్చింది అనగా తాను ఎవడ్రా అన్నాడు బూతులు తిట్టాడు.అక్కడితో ఆగకుండా నువ్వు మళ్ళీ నా నియోజకవర్గంలో కానీ కనిపించినట్టైతే మీ అమ్మ బాబు,బాబాయ్ ఎవరు వచ్చినా సరే ఎవ్వరు ఏమి చెయ్యలేరు అని నిన్ను ఎక్కడ పాతేస్తానో నాకు తెలుసు అంటూ తీవ్ర బెదిరింపులు చాగేసారు.తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు లేకపోతే నిన్ను ఏం చెయ్యాలో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు.దీనితో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏ స్థాయిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారో అర్ధ చేసుకోవచ్చు.ఇప్పుడు లీకైన ఫోన్ కాల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.