వైకాపా పార్టీ ఒక హంతక పార్టీ..! ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్

Monday, September 10th, 2018, 05:30:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం అందరికి తెలిసినదే. అయితే ఈ సమావేశాలలో వైసీపీ పార్టీ నేతల కోసం ఒక అనూహ్యమైన చర్చ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీ మరియు అందులో గల నేతలను ఉద్దేసింది ఘాటైన విమర్శలు చేశారు. రోజు రోజుకి వారి పార్టీ నేతల యొక్క చర్యలు హద్దులు దాటుతున్నాయి అని, వారు హంతకుల వలే ప్రవర్తిస్తున్నారని, ప్రస్తావించారు.

ఇందులో భాగంగా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి దేవినేని ఉమా మహేశ్వర్ రావు గారి మీద వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి వసంత నాగేశ్వర్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వారు దేవినేని ఉమా గారికి ఫోన్ చేసి కడప నుంచి మనుషుల్ని తీసుకువచ్చి అవసరమైతే చంపించె స్థాయి వరకు వెళ్తాము అన్నట్టుగా మాట్లాడారని, తెలుగుదేశం పార్టీ ని ప్రజా స్వామ్యబద్ధంగా ఎదుర్కునే సత్తా లేక వైసీపీ పార్టీ వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments