విజ‌య‌న‌గ‌రం జిల్లాలో.. చంద్ర‌బాబుకు మైండ్‌బ్లోయింగ్ షాక్.. వైసీపీలో చేర‌నున్న‌ టీడీపీ ఎమ్మెల్సీ..?

Tuesday, October 23rd, 2018, 05:45:31 PM IST

ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా సాగుతున్నాయి. సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేల.. అధికార టీడీపీ- ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీల మ‌ధ్య ఒక‌వైపు విమ‌ర్శ‌ల ప‌రంప‌రా మ‌రోవైపు వ‌ల‌స‌లు రెండూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవ‌ల టీడీపీ నుండి కానీ, వైసీపీ నుండి కానీ అసంతృప్త నేత‌లు జ‌న‌సేన‌లోకి జంప్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని సాలూరు నియోజ‌క వ‌ర్గంలో టీడీపీ త‌రుపున ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఉన్నారు. వారిలో ఒక‌రు గుమ్మ‌డి సంధ్యారాణి, మ‌రొక‌రు ఆర్‌పి భాంజ్‌దేవ్‌. అయితే ఈ ఇద్ద‌రు నేత‌లు వచ్చే ఎన్నిక‌ల్లో సాలూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. అయితే తాజాగా సాలూరు ఎమ్మెల్య టిక్కెట్ ఆర్‌పి భాంజ్‌దేవ్‌కి క‌న్ఫాం అయ్యింద‌నే వార్త‌లు టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ సంధ్యారాణి త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అయ్యి కీల‌క నిర్ణాయాలు తీసుకున్నార‌ని టాక్.

ఇక అందులో భాగంగానే టీడీపీ నుండి బ‌య‌టకు వ‌చ్చి వారికి త‌గిన బుద్ది చెప్పాల‌ని సంధ్యారాణి వ‌ర్గీయులు డిమాండ్ చేశార‌ని తెలుస్తోంది. దీంతో ఆ మీటింగ్ అయిన వెంటనే వైసీపీ నేత‌ల‌ను కూడా చ‌ర్చించార‌ని.. త‌న రాజ‌కీయ భ‌విష్యత్తు పై హామీ ఇస్తే వైసీపీలో చేర‌డానికి సుముఖంగా ఉన్నాన‌ని సంధ్యారాణి వైసీపీ ముఖ్య‌నేత‌ల‌కి చెప్పింద‌ట‌. దీంతో ఓకే చెప్పిన వైసీపీ పెద్ద‌లు అధినేత జ‌గ‌న్‌తో ఒక‌సారి మాట్లాడార‌ని జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌ పాద‌య‌త్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే సాగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో త్వ‌ర‌లోనే ఈ టీడీపీ ఎమ్మెల్సీ స‌ధ్యారాణి వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి పెద్ద షాకే అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments