ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఆంధ్ర ద్రోహులు..!

Tuesday, October 2nd, 2018, 05:00:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు అయినటువంటి కన్నా లక్ష్మి నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ల మీద తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసినదే,అంతే కాకుండా వారిపై కొన్ని ప్రశ్నలు కూడా కురిపించారు.కన్నా లక్ష్మి నారాయణ గారు,జెఎవిఎల్ మరియు సోము వీర్రాజులు చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న ఆరోపణల మీద టీడీపీ ఎమ్మెల్సీ అయినటువంటి బుద్ధా వెంకన్న వీరి ముగ్గురి మీద కొన్ని ఘాటైన విమర్శలు చేశారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ మోచేతి నీళ్లు తాగి కడుపు నింపుకొని ఆ ముగ్గురు ఇక్కడి ఆంధ్ర ప్రజల యొక్క కడుపులు కొడుతున్నారని వ్యాఖ్యానించారు.కేంద్రంలోని ప్రధాన మంత్రి మోడీ అండ చూసుకొని ఈ ముగ్గురు ఆంధ్రా ద్రోహులుగా మారారని తెలియజేసారు.దాదాపు పది సంవత్సరాలు మంత్రిగా పని చేసినటువంటి కన్నా లక్ష్మీ నారాయణ గారు వేళా కోట్లు ప్రజా ధనాన్ని దోచేశారు అని,2014 కి ముందు ఆయన ఆస్తులెంత ఆ తర్వాత ఆస్తుల లెక్క ఎంత అని ప్రశ్నించారు.అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు చెయ్యడం హాస్యాస్పదం అని మండిపడ్డారు.