అనంతపురం టిడిపి నెత్తిన శఠగోపం.. సమస్య సృష్టిస్తున్న అతిపెద్ద నేత..!

Tuesday, November 22nd, 2016, 08:39:46 AM IST

babu-jc-diwakar-reddy
అనంతపురం రాజకీయాలంటే ప్రస్తుతం వెంటనే గుర్తుకు వచ్చేది జేసీ దివాకర్ రెడ్డే.గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చి ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన చేరికతో అనంతపురం టిడిపికి మరింత బలం చేకూరిందనడంలో ఎలాంటి సందేశం లేదు.అనంతపురం లో టిడిపి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.కాగా ప్రస్తుతం అనంతపురం టిడిపిలో ఆధిపత్య పోరువలన నేతల మధ్య అగ్గిరాజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆధిపత్య పోరు బడా నేతలైన జేసీ దివాకర్ రెడ్డి, అనంత పురం ఎమ్మెల్యే అయిన ప్రభాకర్ చౌదరి ల మధ్య కావడం విశేషం. ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు ను సైతం కలవర పెట్టే అంశమే.

కాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోమవారం అనంత పురం అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. అనంతపురం లో రోడ్ల విస్తరణని అనంతపురం ఎమ్మెల్యే, కమిషనర్, మేయర్ ముగ్గురూ కలసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జేసీ ఆరోపించారు. దీనితో ఆయన దీక్షని విరమింపజేయడానికి ప్రయత్నించారు. అనంతపురం అభివృధి కోడం తానూ ఎవరి కాళ్లు చీతులు పట్టుకోవడానికైనా సిద్ధమని అదీ కుదరకపోతే జుట్టు పట్టుకునైనా సరే అనంత పురాన్ని బాగుచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దీక్ష చేస్తున్న సమయం లో ఓ దశలో పల్స్ పడిపోవడంతో పోలీస్ లు ఆయన దీక్షని భగ్నం చేశారు. సీమలో టిడిపి బలంగా ఉన్న ఏకైక జిల్లా అనంతపురమే. అగ్రనేతలమధ్యే ఇలా ఆధిపత్య పోరు నడుస్తుంటే టిడిపి అధః పాతాళానికి పడిపోవడం ఖాయమని టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జేసీ సీనియర్ లీడర్ కాబట్టి ఆయన్ని బుజ్జగించడం చంద్రబాబు కు దయితం తలనొప్పి వ్యవహారమే.