ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. జ‌న‌సేన‌లో చేర‌నున్న టీడీపీ ఎంపీ..?

Tuesday, November 13th, 2018, 01:26:30 AM IST

ఏపీలో అధికార టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌ని స‌మాచారం. సార్వ‌త్రిక ఎన్నికులు ముంచుకొస్తున్ననేప‌ధ్యంలో ప‌లువురు అసంతృప్త టీడీపీ నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పాల‌ని భావిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే టీడీపీ ఎంపీ తోట న‌ర‌సింహారావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అయితే జ‌గ్గంపేట సీటును ఇప్ప‌టికే ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఖాయం చేస్తూ నారా లోకేష్ ప్రకటన చేశారు.

ఈ నేప‌ధ్యంలో లోకేష్ నిర్ణ‌యంతో అసంతృప్తి చెందిన తోట న‌ర‌సింహం కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో తోట న‌ర‌సింహం వైసీపీలో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. ప‌వ‌న్ కూడా తోట న‌ర‌సింహం కోరిన స్థానంలో టిక్కెట్ ఇవ్వ‌డానికి ఓకే చెప్పార‌ని.. దీంతో త్వ‌ర‌లోనే ఈ టీడీపీ ఎంపీ జ‌న‌సేన‌లోకి జంప్ అవ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తోట న‌ర‌సింహం క‌నుక టీడీపీని వీడితే ఆపార్టీకి పెద్ద దెబ్బే అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.