జగన్ అనే అవినీతిపరుడితో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారా..?

Tuesday, October 23rd, 2018, 10:39:14 AM IST

ఆంధ్రప్రదేశ్ లోని గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ కి చెందినటువంటి నేతలు జీవీఎల్ మరియు కన్నా లక్ష్మీ నారాయణలు, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మరియు ఆయన తనయుడు నారా లోకేష్ మీద పలు అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసినదే.అయితే ఈ మూడు రోజులు నుంచి బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వం మీద మరింత స్థాయిలో విమర్శలు చేపట్టారు.అగ్రి గోల్డ్ బాధితుల యొక్క సొమ్ముని బాబు గారి ప్రభుత్వం దొంగ లెక్కలు చూపించి వెనకేసుకుంటున్నారని,చంద్రబాబుకి నారా లోకేష్ కి ధన దాహం ఎక్కువని వారి పార్టీకి చెందినటువంటి జీవీఎల్ మరియు కన్నా లక్ష్మీ నారాయణలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ ఆరోపణలు అన్నిటికి టీడీపీ ఎంపీ కేశినేని నాని చాలా బలమైన వ్యాఖ్యలు చేస్తూ తిప్పి కొట్టారు.అసలు అవినీతి మొత్తం మీరు ప్రోత్సహించి మా మీద అవినీతి ముద్ర వెయ్యడం నవ్వొచ్చే విధంగా ఉందని మండిపడ్డారు.అంతే కాకుండా వీరు ఒక పక్క మాది నీతివంతమైన పార్టీ,అవినీతికి దూరం అని చెప్పుకుంటారని,మరి రాబోయే రోజుల్లో అవినీతిపరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారా..?అని ప్రశ్నించారు.మీ ఇరు పార్టీలు కలిసి 6500 కోట్లు అగ్రి గోల్డ్ బాధితులకి తీరుస్తామని మీరు ఎలా చెప్పుకుంటున్నారు.అని సంచలన వ్యాఖ్యలు చేశారు.