వైసీపీ బీజేపీ చీకట్లో సంసారం చేస్తున్నాయి..టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.!

Saturday, September 22nd, 2018, 01:17:32 AM IST

రాజకీయాలు అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి.కానీ మన ఆంధ్రరాష్ట్ర నాయకులలో మాత్రం ఇంకాస్త ఘాటు గానే ఉంటాయి. ఈ రోజు కూడా అలంటి ఘాటైన వ్యాఖ్యలే తెలుగుదేశం మంత్రి కళా వెంకటరావు భారతీ జనతా పార్టీ మరియు వైసీపీ పార్టీలను ఉద్దేశించి అన్నారు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీ బీజేపీ పార్టీల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పార్టీ చేసే అభివృద్ధిని చూడలేకనే వారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.అంతే కాకుండా నరేంద్ర మోడీ మరియు బీజేపీ పార్టీ వారు ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష పెట్టుకున్నారని,లక్ష కోట్లు అవినీతి చేసి,48 వేల కోట్లు అక్రమాస్తుల కేసుల్లో ప్రతీ శుక్రవారం కోర్టుకి వెళ్లి గురువారం పాదయాత్ర ఆపేసి మళ్ళీ శనివారం మొదలు పెట్టే జగన్ మోహన్ రెడ్డి మరియు మీరు చీకట్లో సంసారం చేస్తున్నారని,ఇప్పుడు అదే సంసారం బయట చేస్తే తప్పు ఏమిటి అని విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఉంచి మంతనాలు చేయించే మీలాంటి వారు మా మీద నిందలు వెయ్యడం సరికాదు అని,బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీ అనేది ఒక తోక పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.