చిత్తూరు జిల్లా బ్రేకింగ్ న్యూస్‌.. టీడీపీ ఎంపీ శివప్రసాద్ గన్‌మెన్ భార్య ఆత్మహత్య

Wednesday, October 10th, 2018, 03:12:01 PM IST

ఏపీ అధికార‌ టీడీపీ ఎంపీ శివప్రసాద్ గన్‌మెన్ వెంకటరమణ భార్య సరస్వతి ఆత్మహత్యకు పాల్పడి మ‌ర‌ణించ‌డంతో చిత్తూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది. ఎంపీ శివ‌ప్ర‌సాద్ వద్ద ప్ర‌స్తుతం వెంకటరమణ గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తుండ‌గా… చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మండలం బాలాజీనగర్‌లోని త‌న ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అయితే వారి మ‌ధ్య ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలియ‌దు గానీ అత‌ని భార్య మాత్రం ఉరివేసుకొని తిరిగిరాని లోకాల‌కు వెళ్ళిపోయింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఇక గ‌తంలో గన్‌మెన్ వెంకటరమణ త‌న భార్య‌ను చంపుతాన‌ని బెదిరించాడ‌ని.. ఈ విష‌యం పై అక్క‌డి పోలీసు స్టేష‌న్‌లో కేసు కూడా న‌మోదు అయ్యింద‌ని.. అయితే ఆ కేసు ఇంకా పెండింగులోనే ఉంద‌ని.. ఇంత‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని స‌మాచారం.