పవన్ కు పోటీగా … ఆయన్ను దించుతున్నారు ?

Saturday, November 19th, 2016, 01:20:04 PM IST

pawan-janasena-new
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు జోరుగా చేస్తున్నాడు. అందుకే ఆయన ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి పూర్తీ స్థాయి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు టిడిపి, బిజెపి లకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన జనసేన పార్టీ ద్వారా ఈ పార్టీ లకు పోటీ ఇవ్వనున్నాడు. మరి పవన్ సొంతంగా పోటీ చేస్తాడా ? లేక ఈ పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడా అనేది ఇంకా తెలియరాలేదు. దాంతో పవన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా .. ఆయన్ను ఎదుర్కోవాలంటే .. ఆలాంటి చరిష్మా ఉన్న వ్యక్తి కావాలి కాబట్టి .. ఈ రెండు పార్టీలు కలిసి మళ్ళీ ఎన్టీఆర్ ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మళ్ళీ ఆయన్నే రంగంలోకి దించే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయట !! ఇక పెద్ద నోట్ల రద్దుతో .. సాధారణ జనాలతో .. పాటు చాలామంది డబ్బున్నోళ్ల ఫైర్ అవుతున్నారు కాబట్టి .. ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై చూపనుంది. కాబట్టి .. వాటన్నిటికీ చెక్ పెట్టేలా ప్లాన్స్ జరుగుతున్నాయి.