రామనవమి సంబరాల్లో అశ్లీల నృత్యాలకు టీడీపీ ప్రోత్సాహం…

Tuesday, March 27th, 2018, 05:33:19 PM IST

ఒకవైపు విదేశీయులు భారతదేశం ఆధ్యాత్మికతకి, సాంప్రదాయానికి ప్రతీక అంటూ మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తుంటే, మరో వైపు మనవాళ్ళు మాత్రం భగవంతుడా అంటూ శృంగార గోతులు తీస్తున్నారు. భక్తి ముసుగులో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అసాంఘీక కార్యాకలాపాలను ప్రోత్సహించారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని భోగ మేళాలకు స్వాగతం పలుకుతూ మహిళా నృత్యకారులతో ఉయ్యాల జంపాల అంటూ ఊగుతున్నారు. ఆర్ధిక‌ మంత్రి యనమల‌ రామకృష్ణుడు ఇలాకలో అశ్లీల నృత్యాలను నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఉత్సవాలు జరుపుతాం అంటూ, భోగమేలా ఉత్సవాలు జరిపారు. అశ్లీల నృత్యాలు, గుండాటలు నిర్వహించినప్పటికీ తెలుగు తమ్ముళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం కాదు కదా కనీసం కన్నేర్రజేసిన పనికి కూడా పోలేదు. ఏమని అడిగితే ఇదంతా యనమల‌ రామకృష్ణ ఆద్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలు అంట. ఇంతటి అసాంఘిక పనులకు పాల్పడుతున్నప్పుడు దేవుణ్ణి కరుణించి ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఎక్కడ కనికరిస్తాడు.