వెనక్కి తగ్గని టీడీపీ ఎంపీలు.. దెబ్బకు సభ వాయిదా!

Monday, March 5th, 2018, 02:25:49 PM IST

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్లీ నిరసనలతో పార్లమెంట్ సభలలో నినాదాలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలు బీజేపీని టార్గెట్ చేశారు. ఎలాగైనా ఏపీకి న్యాయం చేయాలని సభలో నినాదాలు చేశారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రత్యేక హోదా విషయంపై ఆందోళనకు దిగారు.

అయితే సభను నిర్వహించేందుకు అందరు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరగా ఎవరు పట్టించుకోలేదు. దీంతో మధ్యాహ్న సమయానికి సభను వాయిదా వేయగా అప్పుడు కూడా టీడీపీ ఎంపీలు ఏ మాత్రం తగ్గలేదు. ఎలాగైనా ఏపీకి న్యాయం చేయాలనీ ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత కోరుతున్నామని నేతలు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో పరిస్థితి మారేలా లేదనిక్ సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. అయితే టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా – విభజన హామీలు అమలయ్యేంత వరకు తగ్గేది లేదనిక్ ఎంపీలు తెలియజేశారు.