కేసీఆర్ పిలవగానే వచ్చారు.. చంద్రబాబు రాలేదు : సీనియర్ టీడీపీ నేత

Saturday, May 26th, 2018, 09:24:44 AM IST

తెలంగాణాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఎంతో కొంత పుంజుకునేందుకు అవకాశం ఉంది. టీఆరెస్ తన హవాతో ఒక్కసారిగా రాష్ట్రంలో తన జెండాను టాప్ ప్లేస్ లోకి తెచ్చేసుకుంది. కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నా కూడా ఇంకా బలం సరిపోవడం లేదు. అయితే తెలంగాణాలో అత్యంత గుర్తింపు పొందిన తెలుగు దేశం పార్టీ మాత్రం కొంచెం కూడా రికవర్ అవ్వడం లేదు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్ల పార్టీలో నేతలు టీఆరెస్ తో చేతులు కలపాల్సి వచ్చింది. మొన్నటి వరకు గెలిచినా ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు టీఆరెస్ తో వెళ్లారు.

ఇక ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన తెలంగాణ టీడీపీ నేతలు కూడా పార్టీని వీడడం చూస్తుంటే పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడ్డట్లు అయ్యింది. రీసెంట్ గా సీనియర్ టీడీపీ నాయకుడైన చంద్రబాబుపైనే విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నేతలను పెద్దగా పట్టించుకోలేదని కేసీఆర్ మాత్రం కష్టపడినా నేతలకు మంచి మంచి పదవులు ఇచ్చి గౌరవించారని చెప్పారు. అంతే కాకుండా 15 ఏళ్ల వరకు కెసిఆర్ తో మాటలు లేకున్నప్పటికీ పిలవగానే తన కూతురి పెళ్లికి వచ్చినట్లు చెబుతూ బ్రతిమాలినా కూడా చంద్రబాబు రాలేదని అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తన పెళ్లి చేశారని ఇక ఇప్పుడు చంద్రబాబు కనీసం నా కూతురి పెళ్లికి కూడా రాలేదని చెప్పారు. ఇక తెలుగు దేశం పార్టీ తెలంగాణాలో క్లోజ్ అయ్యిందని కర్ణాటక ఎన్నికల్ల ఇక్కడ కూడా పరిస్థితులు నెలకొంటాయి అనడం అవివేకం అని మోత్కుపల్లి వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments