40 ఇయ‌ర్స్ బాబుకు షాక్.. వైసీపీలో చేరిన .. 30 ఇయ‌ర్స్ సీనియ‌ర్ టీడీపీ నేత‌..!

Monday, February 11th, 2019, 12:00:58 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార టీడీపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీనుండి సిట్టింగ్ త‌మ్ముళ్ళు మెల్ల‌గా జారుకుంటుండ‌గా.. తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత వైసీపీలోకి చేర‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఎప్ప‌టి నుండో పార్టీకి సేవ‌లు చేస్తూ.. టీడీపీలోనే కీల‌కంగా కొన‌సాగుతున్న నేత‌లకు చంద్రబాబు హ్యాండ్ ఇస్తుండ‌డంతో, క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల నోటిఫికేష్ విడుద‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో టీడీపీ త‌మ్ముళ్ళు పార్టీ మారుతుండ‌డంతో చంద్రబాబుకు త‌ల‌పోటుగా మారింది.

ఇక తాజాగా అస‌లే వైసీపీ కంచుకోట‌గా చెప్పుకునే నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చారు టీడీపీ సీన‌య‌ర్ నేత వైవీ రామిరెడ్డి. గ‌త మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న వైవీ రామిరెడ్డి ఎప్ప‌టినుండో టీడీపీలో కీల‌క‌నేత‌గా ఉన్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆశించిన రామిరెడ్డికి టిక్కెట్ క‌ష్ట‌మ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పార‌ని తెలుస్తోంది. దీంతో అంస‌తృప్తి వ్య‌క్తం చేసిన రామిరెడ్డి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరి.. బాబుకు మాస్ట‌ర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆయ‌న‌తో పాలు పలువురు కార్య‌క‌ర్త‌లు మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ కార్పోరేట‌ర్ ఇలా ప‌లువురు ఒకే సారి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఇప్ప‌టికే ఒక‌వైపు ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి, మ‌రోవైపు కీల‌క నేత‌లు పార్టీ నుండి వ‌రుస‌గా జంప్ అవుతుండ‌డంతో చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.