సీనియర్ నేతను ఇంటికి పంపేసిన టీడీపీ!

Tuesday, May 29th, 2018, 11:41:24 AM IST

తెలంగాణ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని చెప్పడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కేసీఆర్ పార్టీలో నాయకులకు అవకాశాలు ఇచ్చినట్టు చంద్రబాబు ఇవ్వలేదని చెప్పడం కూడా పార్టీలో నేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.

విజయవాడలో జరుగుతున్న మహానాడు సభలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు వేదికలో ఎల్.రమణ ఈ విషయాన్ని తెలిపాడు. పార్టీని బలహీన పరిచేందుకే ఆ విధమైన వ్యాఖ్యలు చేశారని అందుకు ఓ కారణం కూడా ఉందని రమణ అన్నారు. చంద్రబాబుని గవర్నర్ పదవిని అడిగిన మోత్కుపల్లి కి మద్దతు లభించింది. చంద్రబాబు కేంద్రాన్ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారు. అందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. అయితే మోత్కుపల్లి మాత్రం తమిళనాడు గవర్నర్ గా నియమించేలా చూడాలని కోరడంతో కేంద్రం అంగీకరించలేదని ఏల్ రమణ సభలో వివరించారు. అలాగే తెలుగు దేశం పార్టీ లో ఎవరు ఉన్నా లేకపోయినా బలహీన పడదని కార్యకర్తల బలంతో మళ్లీ పుంజుకుంటుందని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments