“ఆపరేషన్ గరుడ”ని ఇంకా నమ్ముతున్న తెలుగు తమ్ముళ్లు..!

Friday, October 5th, 2018, 05:35:56 PM IST

రేవంత్ రెడ్డి మీద జరిగిన ఐటీ దాడుల తర్వాత ఐటీ అధికారులు ఇంకెవరి మీద పడతారో అన్న తరుణంలో ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది ముఖ్య నేతల ఇళ్లలోనూ,వారి పరిశ్రమల మీదను అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు.అయితే ఇది అంతా సినిమాల్లో అవకాశాలు లేక ఒక 20 నిమిషాలు “ఆపరేషన్ గరుడ” అనే చిన్న వీడియో పెట్టి నటుడు శివాజీ మళ్ళీ సంచలనానికి దారి తీసాడు.ఆ ఆపరేషన్ ని ఇతర పార్టీ వాళ్ళు తేలిగ్గా తీసుకున్నా తెలుగుదేశం నాయకులు మాత్రం సీరియస్ గానే తీసుకుంటున్నారు.

ఇంత అకస్మాత్తుగా కేవలం టీడీపీ నాయకుల మీదనే ఐటీ దాడులు జరగడం ఏమిటని,అవినీతి చేసినటువంటి వైసీపీ నేతల మీద చెయ్యకుండా తెలుగుదేశం నాయకులనే లక్ష్యంగా పెట్టుకొని దాడులు నిర్వహించడంలో నరేంద్ర మోడీ,ఇతర పార్టీల వారు కుమ్మక్కయ్యి కావలెనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు.అంతే కాకుండా ఇదంతా చూస్తుంటే ఆపరేషన్ గరుడలోని ఒక భాగంలాగే ఉందని,ముందు ఏదో అనుకున్నామని కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఇదంతా ఆపరేషన్ గరుడ లోని భాగమే అని నమ్మక తప్పడం లేదని తెలిపారు.ఇదంతా బాగానే ఉన్నా ఇంతకు ముందు వరకు బీజేపీ తోనే కలిసి తిరిగి చంద్రబాబు నాయుడుని ఎన్నో మార్లు విమర్శించిన శివాజీ మళ్ళీ అకస్మాత్తుగా చంద్రబాబు మీద ఎక్కడ లేని ప్రేమని ఒలకబోస్తున్నపుడు నమ్మిన తెలుగు తమ్ముళ్లు ఈ ఆపరేషన్ గరుడని నమ్మడంలో తప్పు లేదు.