ప్ర‌తినిధిని కొనేందుకు రూ.40ల‌క్ష‌లు జ‌ల్లేస్తున్న తేదేపా!

Thursday, February 23rd, 2017, 12:30:53 PM IST


వైకాపా అధినేత జ‌గ‌న్‌ని త‌న సొంత ఇలాకాలోనే పోటు పొడ‌వాల‌న్న‌ది చంద్ర‌బాబు ప్లాన్‌. అలా చేస్తే జ‌గ‌న్‌పై అన్ని కోణాల్లోనూ త‌నదే పైచేయి అన్న సంగ‌తిని జ‌నాల్లోకి పంప్ చేయ‌డం సులువు అవుతుంద‌న్న‌ది అస‌లు వ్యూహం. అనుకున్న‌దే త‌డ‌వుగా మాష్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేస్తున్నారు బాబు. అందుకు త‌గ్గ‌ట్టే క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ని నిర్వీర్య ం చేసేందుకు పావులు క‌దుపుతున్నారు. త్వ‌ర‌లోనే క‌డ‌ప జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
ఇక్క‌డ ఇన్నాళ్లు వైకాపాదే పైచేయి. కానీ ఈసారి సీన్ మారేట్టే క‌నిపిస్తోంది. ఇక్క‌డ ఎమ్మెల్సీ పోటీ కోసం బ‌లాల నిరూప‌ణ‌కు దిగితే ఇరు పార్టీల‌కు 400 ఓట్ల బ‌లం ఉన్న‌ట్టు తేలుతోంది.

అంటే జ‌గ‌న్ బలానికి ఇంచుమించు స‌మాన‌మైన బ‌లం తేదేపాకి ద‌క్కుతోంది. అయితే స‌రిగ్గా ఈ స‌న్నివేశంలోనే అమ్మ‌కాలు- కొనుగోళ్ల‌కు తెర‌లేచింద‌ని చెబుతున్నారు. ఇరు పార్టీలు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కొనేందుకు రాజీ ప‌డ‌కుండా డ‌బ్బు వెద‌జ‌ల్లుతున్నార‌ని తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల పంట పండిందని ల‌క్ష‌ల్లో నొల్లుకుంటున్నార‌ని చెబుతున్నారు. తొలుత రూ. 5 ల‌క్ష‌ల‌తో మొద‌లైన‌ భేరం కాస్తా.. రూ.10 ల‌క్ష‌ల నుంచి 40ల‌క్ష‌ల వ‌ర‌కూ వెళ్లింద‌ని తెలుస్తోంది. ఓ ప్ర‌తినిధిని త‌మ‌వైపు తిప్పుకునేందుకు అధికార తేదేపా ఏకంగా 40ల‌క్ష‌లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ కొనుగోళ్లు, అమ్మ‌కాల వేడి తీవ్ర‌త‌ర‌మైంది. వైసీపీ నుంచి ప్ర‌తినిధుల్ని లాక్కునేందుకు తేదేపా ఎత్తుగ‌డ‌లు వేస్తే, రివ‌ర్స్ గేర్ వేస్తోంది వైకాపా. ఇప్ప‌టికే జ‌మ్మ‌ల‌మ‌డుగు వైకాపా నేత‌లు ఇద్ద‌రిని తేదేపా నాయ‌కులు కొనేశారు. క‌మ‌లాపురానికి చెందిన లోక‌ల్ లీడ‌ర్స్‌తోనూ డీల్స్ సెట్ చేసుకుంది తేదేపా.