టీడీపీ విజయం ఖాయం – 110 సీట్లు రానున్నాయి.

Tuesday, May 21st, 2019, 08:41:46 AM IST

ఏపీలో టీడీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయితే ఇతర జాతీయ మీడియా సంస్థలు ప్రకటించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని చంద్రబాబు తోసిపుచ్చారు. కాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా అందరిని ఆందోళనకు గురి చేస్తుందని, ఎవరు కూడా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్నీ చంద్రబాబు ముందు నుండే చెప్తుండగా, నిన్న విడుదలైన పోల్స్ ఫలితాల తరువాత కూడా ఇదే మాట చెబుతున్నాడు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో టీడీపీ 110 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేస్తుందని, అంతకు మించిన స్థానాల్లో విజయం సాధించిన కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ఇందులో మాత్రం చంద్రబాబు చాలా నమ్మకంగా ఉన్నారు.

అయితే లగడపాటి జరిపిన సర్వే కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాదుతూ తొడ కొట్టి మరీ టీడీపీ గెలుపు ఖాయమని అంటున్నారు. వైసీపీ అంతే తరహాలో ఓడిపోతుందని, ఈ సంగతి జగన్ కి కూడా తెలుసనీ బుద్ధా వెంకన్న అన్నారు. తాము ఇలా మాట్లాడానికి కారణం గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ ఇలాగె వచ్చాయని, అపుడు కూడా టీడీపీ ఘనవిజయాన్ని సాధించిందని అన్నారు. కాగా ప్రస్తుతానికి వైసీపీ నేతలందరూ కూడా టెన్షన్ తో ఉన్నారని, ఇప్పుడే ఇలా ఉంటె ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరు కూడా చాలా ఆందోళన చెందుతారని టీడీపీ నేత అన్నారు. అంతేకాకుండా కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయమని, ప్రస్తుతానికి అన్ని కూడా చంద్రబాబు కు అనుకూలంగానే ఉన్నాయని, ఫలితాల తరువాత చంద్రబాబు చెప్పిన మాటలన్నీ కూడా నిజమని తేలుతాయని అన్నారు.