టీడీపీకి డిపాజిట్లు కూడా రావు : వైసిపి సీనియర్ నేత

Monday, June 4th, 2018, 11:20:35 AM IST

వైసిపి సీనియర్ నేత తమ్మినేని సీతారాం టీడీపీ పార్టీ గురించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓవైపు జగన్ మొక్కవోని దీక్షతో ప్రజా సంకల్ప యాత్ర చేస్తుంటే మరోవైపు బాబు నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను మరింత వంచించాలని చూస్తున్నారు అన్నారు. అందుకే చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలకు వ్యతిరేకంగా తమ పార్టీ వంచన దీక్షలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నేడు విజయవాడలోని వైసిపి ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో వేల కోట్లు టిడిపి నేతలు దోచుకుని, మాకు ఏమి ఇవ్వలేదు అని అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

ఓవైపు బిజెపి నేతలు రాష్ట్రానికి ఇచ్చిన నిధులు విషయమై స్పష్టమైన ప్రకటనలు చేస్తుంటే, బాబు మాత్రం వాటి పై వివరణకు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అందినంత దోచుకుని, పంచుకు తింటున్నారని, ఇటువంటి వారికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగు కాంగ్రెస్ పార్టీనా లేక, పిల్ల కాంగ్రెస్ పార్టీనా అనే విషయమై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ఎప్పటినుంచో ఆయన టీడీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలను అన్నివిధాలా మోసం చేసి, వంచించిన ఆయన ఈ నవనిర్మాణ దీక్షలు చెప్పాడుతుంటే ఆ ప్రజలే నవ్వుకుంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు అసమర్ధ పాలన వల్ల యువత, విద్యార్థులు, రైతులు ఎందరో ఆత్మహత్యలతో తమ జీవితాలను బాలి చేసుకుంటున్నారనే విషయం బాబుకు తెలియదా అని అన్నారు. వారి కుటుంబాల ఘోష తప్పకుండ టీడీపీ పార్టీకి తగిలి తీరుతుందని అన్నారు. ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తాను అన్న బాబు, తీరా ఇతరుల మద్దతు తో అధికారం చేపట్టి అధికారం లోకి వచ్చాక ప్రజలకు మొండి చెయ్యి చూపించారని, ముఖ్యంగా రాష్ట్రంలోని కోటి డెబ్భై లక్షల మందికి నిరుద్యోగ భృతి అందిస్తానన్న బాబు, ఇప్పుడు కేవలం ఆ సంఖ్యను పది లక్షలకు కుదించడం వెనుక మర్మమేంటని అన్నారు. అంతే కాదు ఒక్కొక్క చదువుకున్న విద్యార్థికి వారి విద్యార్హతను బట్టి రూ.2000, రూ.3000 ఇస్తాను అన్న ప్రభుత్వం అందరికి కేవలం రూ.1000 ఇవ్వడంలోకాల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇకనైనా ఈ మిగిలివున్న ప్రభుత్వ కాలంలో బాబు యువతకు, ప్రజలకు దిశా నిర్దేశం చేసే నిర్మాణాంతర కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. ఇప్పటికే పూర్తి ప్రభావం కోల్పోయిన టిడిపి పరువు ఆ విధంగా అయినా కొంత వస్తుందని అన్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments