2017 లో టీడీపీ – వైకాపా ఎమ్మెల్యే లు అందరూ కాంగ్రెస్ లోకి ..

Saturday, December 31st, 2016, 11:05:52 AM IST

raguvera-reddy
కాంగ్రెస్ పార్టీ కి 2014లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో చావుదెబ్బ అంటే ఎలా ఉంటుందో చూపించారు ఏపీ జనాలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకొక పది పదిహేను సంవత్సరాల వరకూ ఐసీయూ లోంచి బయటకి రాలేని పరిస్థితి కాంగ్రెస్ ది. అంపశయ్య కీ మరణానికీ మధ్యలో ఉన్న కాంగ్రెస్ ని బతికించేస్తా అంటున్నారు రఘువీరా రెడ్డి. ఆ పార్టీ పీసీసీ ప్రధాన వైద్యుడు గా ఆయన కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. 2017 నూతన సంవత్సరం లో ఆయన పెట్టుకున్న టార్గెట్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ కొత్త సంవత్సరంలో ఆయన టార్గెట్ ఏంటో తెలుసా…? టీడీపీ – వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తేవడం. మీకూ నవ్వొస్తోంది కదా.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఈ కొత్త టార్గెట్ పెట్టుకోవడానికి కారణం ఉంది. తమ పార్టీకే చెందిన ఇతర రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సాధించిన విజయాలు చూసి ఆయన ఇన్స్పైర్ అయి ఈ టార్గెట్ ఫిక్సు చేసుకున్నారట. ముఖ్యంగా రాజస్థాన్ లో దాదాపుగా ఏపీలో ఉన్నట్లే ‘చితి’కిపోయిన కాంగ్రెస్ కు యువ నేత సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యేను మళ్లీ పార్టీలోకి తెచ్చారు. అంతేకాదు.. ఏం వ్యూహం రచించాడో ఏమో కానీ అత్యంత బలంగా ఉన్న అక్కడి బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఏమీ లేని కాంగ్రెస్ లోకి లాగేశారు. అంపశయ్యపై ఉన్న తమ పార్టీలోకి కూడా వలసలు ఉన్నాయని సచిన్ పైలట్ నిరూపించారు.

  •  
  •  
  •  
  •  

Comments