బీజేపీతో టీడీపీ అవిశ్వాస తీర్మానం ఖరారు…

Friday, March 16th, 2018, 03:52:25 PM IST

చాలా రోజులుగా ప్రత్యేక హోదా విషయాలో, కేంద్రం ఇచ్చిన హామీల విషయంలో ఆంధ్రరాష్ట్రం కేంద్రంపై భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే చివరికి ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక పొలిట్ బ్యూరోకి సంబంధించిన సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్రం వైఖరిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసి పంపాలని నిర్ణయించారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సమాచారం పంపనున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఈ నాలుగేళ్లలో ఏం జరిగింది, ఎందుకు విడిపోతున్నాం వాస్తవ వివరాలతో అన్ని ప్రతీ అంశాన్ని ప్రత్యేకంగా వర్ణించిన లేఖ రూపొందించారు. కేంద్రంపై సొంతంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని పొలిట్‌బ్యూరోలో చివరగా నిర్ణయించారు. దొంగల పార్టీ వైకాపా నోటీసుకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే తెలుగుదేశం పార్టీ కేంద్రంపై ప్రత్యేకంగా అవిశ్వాస నోటీసు ఇస్తుందని తెలిపారు. వైకాపా నోటీసుపై ఐదుగురు ఎంపీలే సంతకాలు చేయగా, తెలుగుదేశం నోటీసుపై 16మంది సంతకాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై మిత్ర పక్షాలు కూడా సానుభూతితో మనకి అనుకూలంగా ఉన్నాయన్న ఆయన.. వాటి మద్దతు తీసుకుంటామని చెప్పారు. ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాష్ట్రానికి న్యాయం చేయాలన్నదే తమ డిమాండ్‌ అని సీఎం స్పష్టం చేశారు.