షాకింగ్ న్యూస్ : బాత్రూం వాటర్ తో టీ ….

Thursday, May 3rd, 2018, 12:26:33 PM IST

సాధారణంగా మనలో కొందరు రైళ్లలో ప్రయాణం చేసేటపుడు, అందులో అమ్మే ఆహారపదార్థాలను తినడానికి ఇష్టపడరు. దానికి ప్రధాన కారణం వారు శుచి, శుభ్రత సరిగా పాటించరని. అయితే రైల్వే లో ఆహారపదార్థాలు అమ్మే కొందరు సిబ్బంది కూడా అపరిశుభ్రమైన ఆహరం అమ్మడం ఘటనలు అక్కడక్క చూస్తుంటాం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నఒక వీడియో చూస్తే ఇక జన్మలో ఎవరూ కూడా రైళ్లలో టీ తాగరేమో అనిపిస్తోంది. గత డిసెంబర్ లో చెన్నై సెంట్రల్ నుండి సికింద్రాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో టీ అమ్మే ఇద్దరు వ్యక్తులు మూడు టీ చన్ లు పట్టుకుని ఒక కోచ్ లోకి ఎక్కారు.

అందులో ఒక వ్యక్తి టీ తయారీ కై నీళ్లకోసం కోచ్ లో వున్న బాత్రూం లోకి క్యాన్ లు తీసుకెళ్లి నింపుతుంటే మరొక వ్యక్తి బాత్రూం బయట కాపలా వున్నాడు. అయితే ఈ మొత్తం దృశ్యాన్ని ఆ కోచ్ లో వున్నా ఒక ప్రయాణికుడు గమనించి తన స్మార్ట్ మొబైల్ లో వీడియో తీసి సోషల్, మీడియా లో అప్ లోడ్ చేసాడు. అయితే అప్పటినుండి వైరల్ అవుతున్న ఈ వీడియో పై మొత్తానికి రైల్వే సఖ ఉన్నత అధికారులు చెర్యలు చేపట్టారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఏ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారో కనుక్కుని ఆ కాంట్రాక్టర్ సహా ముగ్గురు వ్యక్తుల్ని విధుల నుండి తొలగించి, కాంట్రాక్టు కూడా రద్దు చేసారు.

అంతే కాదు వారిపై కేసు నమోదు చేయగా కోర్ట్ వారికి రూ. 1 లక్ష ఫైన్ విధించింది. సాక్ష్యాత్తు రైల్వే సిబ్బందే ఇటువంటి చర్యలకు పాల్పడడం సరైనది కాదని, ఇప్పటికైనా రైల్వే వారు మేల్కొంది జరిగిన ఘటనపై చెర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments