టీమ్ ఇండియా ఆల్‌టైమ్.. డిజాస్ట‌ర్ ప్లాప్ షోస్ ఇవే..!

Thursday, January 31st, 2019, 02:55:14 PM IST

ఆస్ట్రేలియాలో చాలా ఏళ్ళ త‌ర్వాత టెస్ట్ సిరీస్‌లో విజ‌య‌కేత‌నం ఎగ‌రేసిని టీమ్ ఇండియా, ఆ వెంట‌నే న్యూజిలాండ్ ప‌య‌న‌మైంది. అక్క‌డ కూడా కివీస్‌ను ఓ ఆటాడుకున్న టీమ్ ఇండియా వ‌రుస‌గా మూడు వ‌న్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. అయితే నాలుగో వ‌న్డేలో భార‌త్ అనూహ్యంగా చ‌తికిల ప‌డింది. న్యూజిలాండ్ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌కు త‌ల‌వ‌చ్చిందిన ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 92 ప‌రుగులుకే ఆలౌట్ అవ‌గా, న్యూజిలాండ్ 14.5 ఓవ‌ర్ల‌లోనే రెండు వికెట్టు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది.

ఇక టీమ్ ఇండియా వంద‌లోపు ఆలౌట్ అవ‌డం ఇదే మొద‌టిసారి కారు. 1978లో సియాల్‌కోట్‌ స్టేడియంలో పాక్‌తో జరిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 79 పరుగులకే చేతులెత్తేయ‌గా.. పాకిస్తాన్ 16.5 ఓవ‌ర్ల‌కే ల‌క్ష్యాన్ని చేధించింది. అలాగే 1981లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులకు భారత జట్టు ఆలౌట్ అవ‌గా, ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ 21 ఒవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని చేధించింది. కాన్పూర్‌ వేదికగా 1986లో శ్రీలంకతో జరిగిన వన్డేలో శ్రీలంక 195 ప‌రుగులు చేయ‌గా, టీమ్ మిండియా 78 పరుగులకే చ‌తికిల ప‌డింది.

ఇక 2000 సంవత్సరంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 ప‌రుగుల భారీ టార్గెట్ ఫిక్స్ చేస్తే.. టీమిండియా 54 పరుగులకే ఆలౌట్ అయ్యి ప‌రువుపోగొట్టుకుంది. అలాగే 2006లో డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 91 పరుగులకే కుప్పకూల‌గా.. 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో టీమిండియా 88 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో హామిల్టన్‌ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమ్ ఇండియా 92 పరుగులకే ఆలౌట్ అయ్యి మ‌రో ప్లాస్ స్కోర్‌ని మూట‌గ‌ట్టుకుంది. ఇవండీ టీమ్ ఇండియా ఆల్‌టైమ్ ప్లాప్ షోస్ వివ‌రాలు.