వైరల్ వీడియో : మీడియాపై దాడి చేసిన షమీ భార్య

Thursday, March 15th, 2018, 04:00:53 AM IST

భారత క్రికెట్ టీం స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మంగళవారం కోల్‌కతాలో పాత్రికేయులపై దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాతో పాటు సొసైటీలో కూడా చర్చనీయాంశమైంది. గత కొద్దిరోజులుగా మీడియా ప్రతినిధులతో ప్రశాంతంగా తన ఆరోపణలు, ఆమె చేసిన ఫిర్యాదులను శాంతంగా వారికి వివరించిన ఆమె మంగళవారం మాత్రం సహనం కోల్పోయి వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడింది. ఈ ఘటన సెయింట్ సెబాస్టియన్ స్కూల్ ప్రాంగణంలో చోటుచేసుకుంది. పాత్రికేయులపై గట్టిగా అరుస్తూ ఒక వీడియో కెమెరాను కూడా బద్దలు కొట్టేసింది. ఆ వెంటనే తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన భర్తపై చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని షమీని మీరెందుకు వివరణ కోరట్లేదని రెండురోజుల క్రితం హసీన్ మీడియాను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాము తన మొదటి భర్త గురించి వివరాలు అడిగామని, ఆ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ఒక భార్యగా అడగడం న తప్పా అని.. దానికి సమాధానం చెప్పకుండా సహనం కోల్పోయి తమపై దాడి చేసిందని మీడియా ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనలో ఓ విలేకరి చేతికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇలా మీడియా ప్రతినిధులపై విరుచుకు పడటం సమంజసం కాదని దీనికి సంజాయిషీ చెప్పాలని మీడియా ప్రతినిధులు అన్నారు.