టీజర్ టాక్ : యాక్షన్ ఇరగదీసిన “ఆఫీసర్”

Friday, May 4th, 2018, 08:10:57 PM IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జునల కలయికలో చాలా సంవత్సరాల తర్వాత కంపెనీ సంస్థ పై నిర్మితమవుతున్న చిత్రం ఆఫీసర్. కాగా ఇప్పటికే విడుదలయిన ఈ చిత్ర మొదటి టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కాగా నేడు ఈ చిత్ర రెండవ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ పరిశీలిస్తే నాగార్జున, ఒక చిన్న పాప మధ్య వస్తున్న సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీజర్ లో ప్రతి మనిషిలోనూ దేవుడు, రాక్షసుడు వుంటారు అనే డైలాగు అలానే, పాలిటిక్స్, మాఫియా లో బయటకి కనిపించేవాణ్ణి నిజాలు కావు అనే డైలాగులు ఈ చిత్రం చూడాలి అనిపించేలా ఆసక్తిని కలిగిస్తాయి.

దీన్ని బట్టి చూస్తే చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అదరగొడతాయని సమాచారం. ముఖ్యంగా మొదటి టీజర్ విడుదల సమయంలోనే ఇది ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా అని తెలుస్తోంది. టీజర్ చివరిలో నాగార్జున పాపతో నువ్వు నన్ను నమ్ముతావా అని అడిగితే మీకన్నా ఎక్కువగా అని ఆ పాప చెప్పే డైలాగు ఆకట్టుకుంటుంది. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల కానుంది. నాగార్జున సరసన మీరు సరీన్ హీరోయిన్ గా నటిస్తోంది….

Comments