గదిలో నిర్జీవమై కనిపించిన తెలంగాణ ఎన్నారై !

Sunday, January 28th, 2018, 08:00:58 PM IST

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న తెలంగాణ ఎన్నారై అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. వెంకన్న గారి కృష్ణ అనే అతడు మూడేళ్ళ క్రితం కాగ్నిజెంట్ సంస్థ లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్ళాడు. సిద్ది పేట లోని ప్రశాంత్ నగర్ అతడి స్వస్థలం. డల్లాస్ లోని కృష్ణ నివాసం ఉంటున్న గదిలో ఈ ఘటన జరిగింది.

ఓ ఇంట్లో అతడు పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. శుక్రవారం నుంచి అతడి గది తలుపులు తెరుచుకోవడం లేదు. కృష్ణ కూడా కనిపించకపోవడంతో ఇంటి యజమాని అనుమానంతో పోలీస్ లకు సమాచారం అందించాడు. దీనితో పోలీస్ లు గది తలుపులు తెరచి చూడగా కృష్ణ శవమై కనిపించాడు. కృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం తెలియడంతో విషాదం నెలకొంది. మంత్రి హరీష్ రావు కృష్ణ మృత దేహాన్ని ఇండియా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మొత్తానికి అతడి మరణం మాత్రం అనుమానాస్పదంగానే ఉందని పోలీస్ లు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments